విడుదల తేదీ: మార్చ్ 10, 2017

దర్శకత్వం: కార్తీక న‌రేన్‌

నటీనటులు: ర‌హ‌మాన్‌, ప్ర‌కాష్ రాఘ‌వ‌న్‌, అశ్విన్ కుమార్‌, ప్ర‌దీప్‌, శ‌ర‌త్‌, ప్ర‌వీణ్‌,

నిర్మాత: చ‌ద‌ల‌వాడ పద్మావ‌తి

సంగీతం: జాక్సె బెజోయ్‌

తేడాది బిచ్చగాడు సినిమాతో సెన్సేష‌న‌ల్ విజ‌యం అందుకున్న నిర్మాణ సంస్థ శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్. ఈ బ్యాన‌ర్ నుండి తెలుగులోకి అనువాద‌మైన సినిమా `16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్‌`. త‌మిళంలో చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులో హారర్‌, స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు స‌క్సెస్ అవుతున్న ఈ నేప‌థ్యంలో `16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్‌` ప్రేక్షకుల అంచనాలను…ఏమాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం

ఎలా ఉందంటే..?:

అతి సంక్లిష్టమైన కధని, చక్కని స్క్రీన్ ప్లే తో ఎక్కడా తికమక పెట్టకుండా చక్కగా అర్ధమయ్యేలా నడిపించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. తీసుకున్న కదా నేపధ్యం, ఎంచుకున్న తారాగణం, స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్ చక్కగా వున్నాయి. దర్శకుడు రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు, నాలుగు విడివిడి కథలను ఒకటిగా కలుపతూ సినిమాను నడపడంలో, నటీ నటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథనంలోని ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా వివరించాడు. సందడిప్ కిషన్, రెజినా, మినహా మిగిలిన అందరూ పూర్తిగా తమిళ తారాగణం అవడం, సాగదీసిన సన్నివేశాలు, తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవడం కొంచెం కష్టం. చివరి వరకు ప్రేక్షకుడికి అదే వెలితిగా అనిపిస్తుంది. ఈ వెలితి మినహా, సినిమా లో చెప్పుకోవాల్సిన మైనస్ పాయింట్స్ పెద్దగా ఏమి లేవు.

సందీప్ కిషన్ హీరో ఇమేజ్ ను వదిలేసి ఒక నటుడిగా కథలోని పాత్రలో కలిసిపోయాడు. నిర్లక్ష్యం ఉన్న కుర్రాడిగా అతని లుక్స్, హావభావాలు, నటన అన్నీ మెప్పించాయి. పల్లెటూరినుండి నగరానికి వుద్యోగం కోసం వచ్చిన యువకుడి పాత్రలో యువ నటుడు శ్రీ కూడా బాగా నటించాడు. మొదటి భాగం మొత్తాన్ని పాత్రల పరిచయాలు, వారి పరిస్థితులు, మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. చిన్న చిన్న కథలను కలిపి మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. అలాగే మహా నగరాలలో నేరాలు జరిగే విధానాన్ని రియలిస్టిక్ గా చూపడం బాగుంది.

మొత్తం మీద స్లో సీన్స్, రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇందులో పెద్దగా లేకపోవడాన్ని పట్టించుకోకపోతే ఈ ‘నగరం’ చిత్రం థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి మంచి చాయిస్ అవుతుంది.

సాంకేతిక వర్గం పని తీరు…?:

ఈ సినిమాలో సాంకేతిక విభాగం పని తీరు గొప్పగానే ఉంది. ముఖ్యంగా సెల్వకుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. క్రైమ్ సన్నివేశాల్ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ కూడా తగిన విధంగా ఉంది. సౌండ్ డిజైన్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మామూలు థ్రిల్స్ ని కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రభావవంతంగా చూపించారు.

బలాలు:

  • నటీనటుల నటన
  • కథ కథనాలు
  • డైరెక్షన్
  • కెమెరా వర్క్
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు:

  • తమిళ నేటివిటీ
  • కొన్ని స్లో సీన్స్
  • తక్కువగా వున్న కామెడీ సీన్స్

రేటింగ్:  3/5

(Visited 7 times, 1 visits today)

Comments