ద్వారక మూవీ రివ్యూ మరియు రేటింగ్

Dwaraka Movie Review

ద్వారక మూవీ రివ్యూ మరియు రేటింగ్

విడుదల తేదీ: మార్చ్ 3, 2017

దర్శకత్వం: శ్రీనివాస రవింద్ర

నటీనటులు: విజయ్ దేవరకొండ, పూజ ఝావేరి, ప్రకాష్ రాజ్

నిర్మాత: ప్రద్యుమ్న చంద్రపాటి, గనేష్ పెనుబోతు

సంగీతం: సాయి కార్తీక్

పెళ్లిచూపులు లాంటి భారీ విజయాన్ని అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తదుపరి చిత్రం ద్వారక. ఈ చిత్రంలో పూజా జ‌వేరి క‌థానాయిక‌, శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా, ప్రద్యుమ్న, గణేష్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. పెళ్లిచూపులు లాంటి హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడం తో మూవీ పై ప్రేక్షకుల భారీ అంచనాలే పెట్టుకున్నారు… మరి ప్రేక్షకుల అంచనాలను ద్వారక ఏమాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కధలోకి వెళ్తే:

ఎర్రశీను (విజయ్ దేవరకొండ ) చిన్నపటినుంచి తన స్నేహితులతో కలసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూవుంటాడు. ఒకరోజు ఎర్రశీను గుడిలో రెండు కోట్ల రూపాయల శ్రీకృష్ణుని విగ్రహం దొంగిలించాలని  ఒక గుడిలోనికి వెళతాడు. అక్కడే వివాహ దోషం పోవటానికి నిద్రిస్తున్న వసుధ(పూజ ఝవేరి) ని చూసి ప్రేమలో పడతాడు. ఇంతలో గుడిలో నిద్రిస్తున్న భక్తులు చూడటం తో వారినుంచి తపించుకోవడానికి  ద్వారకా అపార్ట్మెంట్ లోకి చొరబడతాడు.

గురుమూర్తి(30 ఇయర్స్ పృథ్వి ) మాటలతో అక్కడున్న వారు తెల్లవారేసరికి ఎర్రశీను ని కృష్ణానందస్వామి గా మార్చేస్తారు . అక్కడినుంచి పారిపోదామనుకున్న ఎర్రశీను వసుధ ను చూసి ఆగిపోతాడు.ఇక్కడి నుంచి ఎర్రశీను ప్రేమించిన అమ్మాయిని ఎలా సాధిస్తాడు ? తనకు ఎదురైన అవాంతరాలను దాటి దేవుడి అవతారం నుండి మనిషిగా ఎలా మారాడన్నదే మిగితా కధ.

ఎలా ఉందంటే..?:

మొదటి భాగం కామెడీతో బాగానే వుంది అనిపించాడు దర్శకుడు. ఇక రెండవ భాగానికి వచ్చేసరికి కధనం కాస్త నెమ్మదిస్తుంది . బోరింగ్ సన్నివేశాలతో ప్రేక్షకుడికి విసుగును తెప్పిస్తాడు. కాకపోతే క్లైమాక్స్ దగ్గర కొంచం ఆసక్తిగా అనిపిస్తాడు కానీ అక్కడికే ప్రేకకుడు సీరియల్ మూడ్ లోకి వెళ్ళిపోతాడు. డైరెక్షన్ లోపం, కెమెరా పనితనం లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. దొంగ బాబా గా విజయ్ నటన బాగానే ఉంటుంది. హీరోయిన్ సినిమాకు పెద్ద మైనస్, హీరోయిన్ పూజ ఝవేరి తన అందం తో కాదు కదా నటనతోను ఆకట్టుకోలేకపోయింది. హీరో స్నేహితుల కామెడీ అక్కడక్కడ మెప్పిస్తుంది. అక్కడక్కడా షకలక శంకర్ కామెడీ సినిమాను నిలబెడుతుంది కానీ కధలో కొత్తదనం లేకపోవడంతో కధనం ఆసక్తిగా అనిపించదు. సినిమా లో చెప్పుకోవలసింది మాటలు, లక్ష్మి భూపాల్ అందించిన మాటలు చాలా బాగున్నాయి సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారేనా ఈ సినిమాని తీసింది అనిపిస్తాయి నిర్మాణ విలువలు. పాటలు సినిమాకి ఏమంత ఉపయోగకరం కాదు. నేపధ్యసంగీతం పరవాలేదు .

బలాలు:

  • విజయ్ దేవరకొండ నటన
  • మాటలు
  • సినిమా మొదటిభాగం
  • అక్కడక్కడా కామెడీ

బలహీనతలు:

  • హీరోయిన్
  • కధ
  • దర్శకత్వం
  • పాటలు

చివరిమాట :మెప్పించలేకపోయిన స్వామిజి

రేటింగ్ : 2/5