గుంటూరోడు మూవీ రివ్యూ మరియు రేటింగ్

Gunturodu movie review

గుంటూరోడు మూవీ రివ్యూ మరియు రేటింగ్

విడుదల తేదీ: మార్చ్ 3, 2017

దర్శకత్వం: ఎస్. కె. సత్య

నటీనటులు: మంచు మనోజ్ కుమార్, ప్ర‌గ్యా జైస్వాల్, రాజేంద్ర ప్రసాద్, సంపత్, రావు రమేష్, కోట శ్రీనివాస రావు

నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి

సంగీతం: డి.జె వసంత్

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్ గా, ఎస్.కె స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం గుంటూరోడు. ఈ చిత్రానికి డి.జె వసంత్ సంగీతం అందించారు. ఈ మూవీ పై చిత్ర యూనిట్ ముఖ్యంగా మంచు మనోజ్ భారీ అంచనాలే పెట్టుకున్నారు… మరి ఆ అంచనాలు ఏమేరకు ఫలించే అవకాశాలు ఉన్నాయో మన సమీక్ష లో చూద్దాం.

కధలోకి వెళ్తే: 

గుంటూరులో వుంటూ, తల్లి లేని కొడుకుని చాలా గారాబంగా పెంచుతాడు సూర్యనారాయణ (రాజేంద్రప్రసాద్), ఆలా గారాభంగా పెరిగిన కన్నా (మనోజ్) భయం అంటే ఏంటో తెలియకుండా పెరుగుతాడు, తన ముందు ఏదైనా తప్పు జరిగితే మాత్రం అది ఎవరైనా సరే లెక్కచేయకుండా లెక్కలు సరిచేసే క్యారెక్టర్ కన్నా ది. ‘కన్నా’ ‘అమ్ము ప్ర‌గ్యా జైస్వాల్ ‘ ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు, కానీ కన్నా ఒకరోజు గుంటూరులో పేరుమోసిన క్రిమినల్ లాయర్ శేషు (సంపత్) ని కొడతాడు. అహంకారం, కోపం, ఎవరినీ లెక్కచేయని వ్యక్తిత్యం వున్న శేషు కన్నా ని చంపాలనుకుంటాడు… అసలు కన్నా శేషు ని ఎందుకు కొట్టాడు ? ఇంతకీ అమ్ము ఎవరు ? కన్నా అమ్ము ప్రేమని పొందగలిగాడా ? పగతో రగిలిపోతున్న శేషు ని ఎలా ఎదుర్కున్నాడు అన్నది మిగిలిన కధ.

ఎలా ఉందంటే..?:

సినిమా రిలీజ్ కి ముందు డైరెక్టర్ ఎస్.కె సత్య, మంచు మనోజ్ చాలా సార్లు ఈ సినిమా పై తమకున్న నమ్మకాన్ని నొక్కి చెప్పారు, అసలే వరుస ప్లాపులతో వున్న మనోజ్ తో ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి అయినా ఇంత ధీమాగా ఎందుకు మాట్లాడారో సినిమా చుస్తే అర్ధమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ తో సినిమా మొదలవుతుంది. అదిరిపోయే మనోజ్ ఎంట్రీ సీన్ తో ప్రేక్షకలు సినిమా కి కనెక్ట్ అయిపోతారు. అద్భుతమైన ఫైట్స్, మంచి బాక్గ్రౌండ్ మ్యూజిక్, మాస్ డైలాగ్స్ తో దర్సకుడు ఎస్.కె సత్య గుంటూరోడిని మంచి రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడం లో విజయవంతమయ్యారు. స్లో మోషన్ లో తెరకెక్కించిన ఫైట్ సీన్స్ చాల అద్భుతంగా వున్నాయి. హీరో, విల్లన్ ల కేరక్టర్స్ ని చాల బాగా డిజైన్ చేసారు, కానీ సాంగ్స్ విషయంలో అంత శ్రద్ధ తీసుకున్నట్లు అనిపించలేదు. క్లైమాక్స్ ని కూడా చాల సింపుల్ గా తేల్చేసినట్లు అనిపించింది.

తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో, విలక్షణమైన డైలాగ్ డెలివరీ తో పాటు మనోజ్ నటన లోను పరిణితి కనిపించింది, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్, విల్లన్ తో ఛాలెంజ్ చేసే సన్నివేశాల్లో చాల బాగా నటించాడు. ఇక విల్లన్ గా సంపత్ తన నటనతో మెప్పించాడు. ప్ర‌గ్యా జైస్వాల్ నటన అందం తో సినిమా కి ప్లస్ అయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో కోట శ్రీనివాసరావు, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తమ పాత్రలకి న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం పని తీరు…?:

బాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మెప్పించిన డి.జె వసంత్, పాటలతో మెప్పించలేక పోయాడు. సినిమాటోగ్రఫీ చక్కగా వుంది. ఎడిటింగ్ లో కార్తీక్ శ్రీనివాస్ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఎస్.కె సత్య డైలాగ్స్ క్లాప్స్ కొట్టేలా వున్నాయ్.

ఒక్క మాటలో: మంచి రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్

బలాలు:

  • డైరెక్షన్
  • స్క్రీన్ ప్లే
  • మనోజ్
  • సంపత్ (విల్లన్)
  • బాక్గ్రౌండ్ మ్యూజిక్

బలహీనతలు:

  • సాంగ్స్
  • క్లైమాక్స్

రేటింగ్:  3.25/5