ల‌క్కున్నోడు మూవీ రివ్యూ మరియు రేటింగ్

Luckunnodu Review and Rating

విడుదల తేదీ: జ‌న‌వ‌రి 26, 2017

దర్శకత్వం: రాజ్ కిరణ్

నటీనటులు: మంచు విష్ణు, హన్సిక

నిర్మాతలు: యమ్.వి. వి సత్యనారాయణ

మ్యూజిక్: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు రాజమణి

 

హ్యాండ్సమ్ యాక్ట‌ర్ మంచు విష్ణు, బ‌బ్లీ బ్యూటీ హ‌న్సిక మోత్వాని జంట‌గా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ల‌క్కున్నోడు. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ఎం.వి.స‌త్యనారాయ‌ణ నిర్మించిన ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

‘ఈడో రకం ఆడో రకం’ సక్సెస్ అందుకున్న విష్ణు , ‘గీతాంజలి’తో హారర్‌ కామెడీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాజ్ కిరణ్ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ రావడం తో మంచు అభిమానులతోనే కాక సినీ ప్రేక్షకులకు సైతం ఈ మూవీ ఫై అంచనాలు ఏర్పడ్డాయి..మరి వారి అంచనాలకు ల‌క్కున్నోడు ఏమాత్రం అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం..

 

కధలోకి వెళ్తే: లక్కీ(విష్ణు) పేరుకు మాత్రం లక్కీ, కానీ ఇతడు పుట్టినప్పటి నుండి దురదృష్టం నీడలా వెంటాడుతుంది. ఇలాంటి అతడికి పద్మావతి(హన్సిక) కనిపిస్తుంది..మొదటి చూపులోనే ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు..ఇదే సమయం లో లక్కీ చెల్లెలికి నిశ్చితార్థం అవుతుంది. కట్నం డబ్బు ఇవ్వడానికి లక్కీ వెళ్తుండగా అతడి బ్యాగ్‌ ఎక్కడో మిస్ అవుతుంది.. తర్వాత లక్కీ ఏంచేస్తాడో, తన చెల్లి పెళ్లి ఎలా చేస్తాడో, తన ప్రేమని ఎలా దక్కించుకుంటాడో తెర ఫై చూడాల్సిందే..

ఎలా ఉందంటే..?: స్టార్టింగ్ సీన్ చూస్తే కథలో ఎదో కొత్తదనం ఉంది అనుకుంటాం… కాని కథ వెళ్లే తీరును బట్టి కొద్ది సేపటికే కథ మొత్తం తెలిసిపోయింది అనే భావన ప్రేక్షకులకి కలుగుతుంది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కూడా పెద్దగా కనెక్ట్ కాలేదు. ఈ సినిమాలో కాస్త చెప్పుకోవాల్సింది మంచు విష్ణు నటన గురించే, తనదయిన బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.. మోహన్‌బాబును ఇమిటేట్‌ చేస్తూ మంచు ఫ్యామిలీ అభిమానులను ఆకట్టుకున్నాడు.

‘గీతాంజలి’ తో ప్రేక్షకులను మెప్పించిన రాజ్ కిరణ్ , ఈ మూవీ లో ఆస్థాయి లో మెప్పించలేక పోయాడు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించినా, సెకండ్ హాఫ్ ఆకట్టుకోవడం లో విఫలం అయ్యాడు. ఇక ఫైట్స్ రెగ్యులర్ గా అనిపించాయి..ఇక హన్సిక విషయానికి వస్తే కథలో చెప్పుకోదగ్గ రోల్ ఏమి కాకపోయినా గ్లామర్ కు మాత్రమే పనికొచ్చింది… విరామానికి ముందు పదినిమిషాలు  ఉండే సీన్సు ప్రేక్షకులకు కనెక్ట్  అయినా విరామం తర్వాత రొటీన్ స్టోరీలా వుండటంతో బోర్ కోటేస్తుంది.  వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను కామెడీ పర్వాలేదనిపించిది. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి మిగతా నటి నటులు వారి వారి పాత్రల మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు…?: ముందుగా మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాకు సంగీతం పెద్దగా ఉపయోగపడలేదని చెప్పవచ్చు.. అచ్చు, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు ఇద్దరు కూడా తమ సంగీతం తో ఆకట్టుకోలేకపోయారు. డైమండ్ ర‌త్న‌బాబు డైలాగ్స్ అక్కడక్కడా పర్వాలేదు అనిపించాయి..విష్ణు చేత ఎక్కవగా మ్యావ్‌ మ్యావ్‌ అంటూ విసుగు తెప్పించాడు. ఎంవివి సినిమా సంస్థ నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

బలాలు: 

  • ఫస్ట్ హాఫ్
  • కామెడీ

బలహీనతలు: 

  • స్టోరీ
  • బోరింగ్ సన్నివేశాలు
  • సెకండ్ హాఫ్
  • మ్యూజిక్

రేటింగ్: 2.5/5