శతమానం భవతి మూవీ రివ్యూ మరియు రేటింగ్

Shatamanam Bhavati movie review

శతమానం భవతి మూవీ రివ్యూ మరియు రేటింగ్

 

విడుదల తేదీ : జ‌న‌వ‌రి 14, 2017

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : సతీష్ వేగేశ్న

నటీనటులు: శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ తదితరులు.

నిర్మాతలు: రాజు , శిరీష్

మ్యూజిక్: మిక్కీ జె మేయర్

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం “శతమానం భవతి”..తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథ చిత్రంగా సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫై ఫ్యామిలీ ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు..ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో వచ్చిన ఖైదీ నెం 150 , గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్స్ అయి అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాయి..మరి ఆ రెండు చిత్రాల మధ్య ఈ శతమానం భవతి ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో..? అసలు కథ ఏంటో..? ఇప్పుడు చూద్దాం..

కధలోకి వెళ్తే: రాజుగారు(ప్ర‌కాష్‌రాజ్‌), జాన‌క‌మ్మ‌(జ‌య‌సుధ‌) మ‌న‌వ‌డు రాజు(శ‌ర్వానంద్‌)తో క‌లిసి ‘ఆత్రేయ‌పురం’ అనే ప‌ల్లెటూరులో నివాసం ఉంటారు.. రాజుగారి కి ఇద్ద‌రి కొడుకులు, ఒక కూతురు అమెరికాలో సెటిల్ అయిపోతారు..రాజుగారు ఎప్పుడు రమ్మన్న కానీ వారు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఈ సంక్రాంతి కైనా కూతురు , కొడుకులను ఇంటికి వస్తే బాగుండు అని జానకమ్మ , రాజుగారితో అంటుంది..దీంతో రాజుగారు ఓ పధకం వేసి , కొడుకులను , కూతుర్ని సొంతవూరికి వచ్చేలా చేస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? ఇంతకీ రాజుగారు వేసిన పథకం ఏంటి..? శ‌ర్వానంద్‌  రాజుగారి మనవరాలితో ( అనుపమ పరమేశ్వరన్)  ఎలా ప్రేమలో పడతాడో  మీరు తెర ఫై చూడాల్సిందే..

ఎలా ఉందంటే..?: ఇ సినిమాలో ముందుగా ప్రకాష్ రాజ్ , జయసుధ ల యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా మన ఇంట్లో పెద్దవారుగా వీరు ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది చిత్రం చూస్తుంటే..వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి. అలాగే సెంటిమెంట్స్ సీన్స్ లలో కంటతడి పెట్టించారు.

శర్వానంద్ యాక్టింగ్ కూడా ఎంతో ఆకట్టుకుంది..తాత బాగోగులు చూసుకుంటూ పల్లెటూరు లో ఉండే చక్కటి అబ్బాయి రోల్ లో కనిపించాడు..మరోపక్క మరదలి ప్రేమలో మునిగే బావ గా అందరికి నచ్చాడు. ప్రధానంగా శర్వా – అనుపమ ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగా యూత్ కు బాగా ఆకట్టుకుంటుంది..మనకు ఓ మరదలు ఉంటె బాగుండే అనిపిస్తుంది.

అ ఆ , ప్రేమమ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనుపమ పరమేశ్వరన్, ఈ మూవీ లో పల్లెటూరు అమ్మాయిగా కనిపించి అభిమానుల చేత 100 మార్కులు వేసుకుంది. తన గ్లామర్ తో కట్టిపడేసింది. అలాగే నటన లో కూడా చాల కొత్తగా అనిపించింది.

ఈ మధ్య చాల సినిమాల్లో ప్రవీణ్ అలరిస్తున్నాడు..హీరో కు ఫ్రెండ్ రోల్ లో ఈ మూవీ లో కూడా ఇతడి కామెడీ చాల బాగుంది. సరైన టైమింగ్ లో తన పంచ్ కామెడీ తో థియేటర్స్ లలో నవ్వులు కురిపించాడు. సీనియర్ నటి , నటులు నరేష్ , ఇంద్రజ లు మరోసారి తెరఫై కనిపించి , వారి నటన తో పాత రోజులు గుర్తుచేశారు. ఇక రాజారవీంద్ర , శిజు మొదలగు నటి నటులు వారి పరిధి మేరకు బాగా నటించారు.

సాంకేతిక వర్గం పని తీరు…?:  సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు హైలైట్ గా నిలిచింది..సంక్రాంతి టైం లో చక్కటి పల్లెటూరు అందాలను చూపించి ప్రేక్షకులను పల్లెటూరు కు తీసుకెళ్లాడు..ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు.

సినిమాకు మరో ఆకర్షణ మిక్కీ జె మేయర్ సంగీతం..కథకు తగ్గ సాంగ్స్ , దానికి తగట్టే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి మరోసారి సంక్రాంతి బరిలో సూపర్ ఆల్బం ఇచ్చి సక్సెస్ అయ్యాడు. నిర్మాత , దర్శకుడు పెట్టుకున్న నమ్మకానికి 100 % నిలుపుకున్నాడు.

ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడా కాస్త బోర్ కొట్టించిన ఓవరాల్ గా ఓకే. కథ – మాటలు – స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ..సతీష్ వేగేశ్న చక్కటి సంబాషలతో పాటు స్క్రీన్ ప్లే కూడా అదరగొట్టాడు.

ఇక దిల్ రాజు నిర్మాణ విలువల గురించి చెప్పనవసరం లేదు..సినిమా అభిమాని..కథ బాగుండాలే కానీ ఎంతటి ఖర్చు అయినా పెట్టి సినిమాను నిర్మిస్తాడు..ఈ చిత్రానికి కూడా భారీ బడ్జెట్ పెట్టనున్న కథ కు తగ్గ లొకేషన్స్ , కాస్ట్ క్రూ ఎంచుకుని సినిమాని ఎంతో బాగా నిర్మించాడు

బలాలు:

  • నటి నటుల పెర్ఫార్మెన్స్
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ

బలహీనతలు:

  • ఊహాజనిత కధ
  • సెకండ్ హాఫ్

రేటింగ్: 3.5/5